పివి నరసింహారావుకి భారతరత్న బిరుదు ఇవ్వడం సంతోషకరం

– ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా తరఫున వర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి
నవతెలంగాణ కంఠేశ్వర్
ఆర్థిక సంస్కరణల పితామహుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు, భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు దివంగత నేత పీవీ నరసింహారావుకి భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వడం పట్ల ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాలతో సత్కరించి, స్మరించుకున్నారు. ఈ అరుదైన భారతరత్న బిరుదుని తెలంగాణ ముద్దుబిడ్డ పీవి నరసింహారావుకి రావడం తెలంగాణ జాతి గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో  ఉన్నటువంటి పోస్టల్ స్టాంప్ ని కూడా త్వరలో విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా పీవీ నరసింహారావు సేవలు గుర్తించి జాతి గర్వించే విధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు గుర్తుండే విధంగా పీవీ నరసింహారావు కోసం చిరస్మరణీయం ఉండే విధంగా గుర్తింపు నివ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కుటుంబ పరంగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా కావడం తెలంగాణ జాతి గర్వించదగ్గ విషయం ఆయన సేవలకు మునుముందు కూడా మంచి గుర్తింపు ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కొలవి అనిల్ కుమార్, జిల్లా నాయకులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love