హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయకుండా అక్రమ అరెస్ట్ లు చేయడం సిగ్గు చేటు

– ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ
నవతెలంగాణ-సూర్యాపేట : సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా యస్.ఎఫ్.ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ లు చేయడం సిగ్గు చేటని  రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ల ముందు ధర్నాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన సందర్బంగా శ్రీకాంత్ వర్మ నూ పట్టణ పోలీస్ లు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందిచారు. ఈ సందర్బంగా  అయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని  వారి సమస్య లు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మెస్ ,కాస్మోటిక్ చార్జీలను పెంచామని చెప్పిన ప్రభుత్వం కాగితాలకు పరిమితం చేసిందన్నారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్గీలను విడుదల చేయాలని, నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. వసతి గృహాలకు గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించాలన్నారు. అద్దె భవనాల్లో విద్యార్డులు తీవ్రమైన సమస్యలకు లోన్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కళాశాల విద్యార్థినిలకు మెడికల్ కిట్లు అందించాలన్నారు. సమస్యలు పరిష్కారం చేయమంటే అక్రమ అరెస్టులు కేసులు నమోదు చేయడం ప్రభుత్వ పతనానికి సంకేతం అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.
Spread the love