ఆ పార్టీలను నిమ్మతే అగమే.

•మరోసారి ఆశీర్వదించండి
•ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత
•పలు గ్రామాల్లో ప్రచారం
• ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి దుర్మార్గమైన చర్య.. గొంగడి సునీత
నవ తెలంగాణ _బొమ్మలరామరం
కాంగ్రెస్ బిజెపి నాయకులు మాటలు నమ్మితే ఆగం కావడం తప్ప మిగిలేది ఏమీ ఉండదని ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత అన్నారు.సిద్దిపేట ఎంపీ దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దౌల్తాబాద్ మండలం సిరిపురం గ్రామంలో జరిగిన దాడి హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఆలేరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని పిల్లిగుంట్ల తండా, చౌదర్పల్లి ,మాచన్పల్లి, నాయకుని తండా, తిమ్మాపురం, బోయిన్పల్లి మునీరాబాద్ ,ప్యారవరం, సోలిపేట, చీకటిమామిడి, మర్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలకు తెరలేపింది అని ఆమె అన్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలవాలని ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తారని అనుకున్నాం కానీ అత్యలు కూడా చేస్తారని అనుకోలేదని అన్నారు. దేవుడి దయతో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని కాంగ్రెస్ పార్టీ నాయకులతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు తెర లేపడం కాంగ్రెస్ పార్టీకి మంచి పద్ధతి కాదని ఇలాంటి ఘటనలు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం దాడులు దుమ్మిలు జరిగేవని హైదరాబాదులో ఎప్పుడు కర్ఫ్యూవతరణ వారణం ఉండేదని తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తూ పరిపాలన సాగిందని మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ఫ్యూ వాతావరణమే ఏర్పడుతుంది అని ఆమె విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వచ్చే ఎన్నికల్లో ఆలేరులో రాష్ట్రంలో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ధీమా మా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, వైస్ ఎంపీపీ శోభా చంద్రమౌళి, సింగల్ విండో చైర్మన్ బాల నరసింహ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, సెక్రటరీ జనరల్ లక్ష్మారెడ్డి, గూడసింహారెడ్డి, పోచం రెడ్డి, సర్పంచులు మచ్చ వసంత శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, గణేష్, నాయకులు మల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Spread the love