– బీజేపీనుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం
– ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
– త్రిముఖ పోరు తప్పదని స్థానికంగా చర్చ
నవతెలంగాణ-కొడంగల్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజులు సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ఒక అడుగు ముందుకేసింది. ఆదివారం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. మరో 2, 3 రోజుల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కా లంలోనే బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్‌కు ఈసారి ఎమ్మె ల్యే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్టు తెలు స్తుం ది. కొడంగల్ నుండి చికోటి ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దించేందుకు అధిష్టానం చూస్తు న్నట్టు తెలుస్తుంది. విడు దలయ్యే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కొడంగల్ అభ్యర్థిగా చీకోటి ప్రవీణ్ కుమార్ పేరు ఉంటుందని కొడంగల్ నియోజకవర్గంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొడంగల్‌లో ఇప్పుడు చీకోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయింది. కొడంగల్ నియోజ కవర్గంలో రేవంత్‌రెడ్డి, నరేం దర్‌రెడ్డి లాంటి బలమైన నాయకులను ఓడించాలంటే చీకోటి ప్రవీణ్ లాంటి యువనాయకులు అవసరమని అధిష్టా నం ఆలోచిస్తుందట, నిజంగానే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే కొడంగల్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షులు రేవం త్‌రెడ్డి బలమైన నాయకులు ఉన్నారు. గత ఎన్నిక ల్లో బీజేపీకి 2,624 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో చీకొట్టి ప్రవీణ్ కుమార్ బరిలో ఉంటే బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకుతోపాటు తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్ల సంఖ్య కొంత పెరిగే అవకాశాలు న్నాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవం త్‌రెడ్డిని, ఎమ్మెల్యే మొత్తం నరేందర్‌రెడ్డిలను తట్టుకొని నిలబడతారా అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉన్న ప్రశ్న ? కాంగ్రెస్, బీఆర్ ఎస్ అభ్యర్థుల్లో ఎవరికి లాభ మే ఎవరికి నష్టమే అనే చర్చ జోరుగా సాగుతుంది. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి మొగ్గుచూపుతారో వేసి చూడాల్సిందే.