కాంగ్రెస్ తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం

– కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామాజీపేట, మైలారి గూడెం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్షణాల్లో పరిష్కారం  అయ్యేది, కొత్త పెన్షన్ల దరఖాస్తులు క్షణాల్లో పరిష్కారం అయ్యేవి, ఇంట్లో  ఎందరు అర్హులు ఉంటే అందరికీ పెన్షన్ వచ్చేది కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఊసే లేదు అన్నారు. సమస్యలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో త్వరగా పరిష్కారం కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు వెంటనే అమలు చేస్తామని అన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని అన్నారు.  బీర్ల ఐలయ్య ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారు రామాజిపేట గ్రామ ఉపసర్పంచ్ విరవెల్లీ చంద్ర శేఖర్ రెడ్డి, రెండవ వార్డు నెంబర్ దయ్యాల లత వెంకటేష్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు అరె యాదగిరి, అరె మథు, కోల కొమురయ్య, కో ఆప్షన్ సభ్యులు మంచాల విజయ లక్ష్మి చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్దులు, ఉపాధ్యక్షులు నరేష్, యూత్ అధ్యక్షుడు కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love