పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి

– పట్టణంలో డ్రైడే ఫ్రైడే
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియ అధికారి శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం ప్రైడే డేలో భాగంగా పట్టణంలోని వార్డు 48 పరిధిలోని నేతాజీ చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ నీరు నిల్వ లేకుండా చూడాలని అవగాహన కల్పించారు. అక్కడక్కడ కూలర్లు, కుండిల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. తెలంగాణ సంస్కృతిక కళాకారులు పాటల ద్వారా సీజనల్‌ వ్యాధుల గురించి తెలియజేశారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రజలను చైతన్య పరిచారు. వర్షకాలంలో వ్యాధులు దోమలు, కలుషిత నీటితోనే వస్తాయని తెలిపారు. ప్రజలు పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలు వృద్ది చెందకుండా నీరు పరిసరాల్లో నిల్వకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరి ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌, పుత్లీ బౌలి అర్బన్‌ పీహెచ్‌సీ సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love