ఒకరిని నిశ్చితార్థం చేసుకొని మరొకరికి పెండ్లి చేసుకుంటే! మోసపోయిన వ్యక్తి బాధ వర్ణనాతీతం. అంతే కాదు ఆ కుటుంబం కూడా మానసికంగా కుంగిపోతుంది. అదే ఆ రెండు కుటుంబాలు బంధువులు అయితే ఇక జీవితాంతం ఈ బాధ వారిని వెంటాడుతూనే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకోవల్సి వస్తే ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా మోసం చేస్తే మాత్రం అనేక సమస్యలు వస్తాయి. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో…
నవ్య డిగ్రీ పూర్తి చేసింది. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వయసు 26 ఏండ్లు. ‘చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నావు, వయసు కూడా పెరిగిపోతుంది.. ఇక పెండ్లి చేసుకో’ అని తల్లిదండ్రులు అబ్బాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. నవ్యకు సంబంధం చూస్తున్నారని తెలుసుకున్న మేనత్త సుభద్ర ‘ఎవరో కొత్త వ్యక్తి ఎందుకు, మా కృష్ణ ఉన్నాడు కదా! అమ్మాయి కూడా మనకు దగ్గరలో ఉంటుంది. కృష్ణ మీ కండ్ల ముందు పుట్టి పెరిగాడు. వాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణకు, నవ్యకు పెండ్లి చేస్తే బాగుంటుంది’ అన్నది. ఆమె చెప్పింది బాగానే ఉందని నవ్య తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. నవ్య, కృష్ణ కూడా చాలా సరదాగా స్నేహితుల్లా ఉంటారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. వాళ్ల స్నేహితులు, అలవాట్ల గురించి కూడా అన్నీ తెలుసు. దాంతో నవ్యకు ఈ సంబంధం నచ్చలేదు. ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పమని తల్లిదండ్రులతో పాటు మేనత్త కూడా అడిగింది. ‘కృష్ణ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు నేను అతన్ని ఎలా పెండ్లి చేసుకోవాలి. ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా!’ అంది. దానికి ‘అవును, ఆ అమ్మాయి విషయంలో చాలా గొడవలు జరిగాయి. ఆ అమ్మాయి కృష్ణ కంటే వయసులో పెద్దది. వారి కులం కూడా వేరు. మనకీ వాళ్లకు సరిపోదు. అందుకే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసుల సమక్షంలో లెటర్ కూడా రాసుకున్నాం. ఇది జరిగి దాదాపు ఆరు నెలలు అవుతుంది. అప్పటి నుండి కృష్ణ ఆ అమ్మాయితో మాట్లాడడం లేదు.
ఈ విషయం నీక్కూడా తెలుసుకదా! నీకు అన్ని విషయాలు తెలుసుకాబట్టి బావను అర్థం చేసుకుంటావని అనుకున్నాను. అదే వేరే అమ్మాయి అయితే ఎలా ఉంటుందో తెలియదు’ అంది మేనత్త. దాంతో తల్లిదండ్రులు కూడా బావను పెండ్లి చేసుకుంటే తప్పేముంది అన్నారు. దాంతో నవ్య ‘ముందు నేను బావతో మాట్లాడతాను. మాకు కొద్దిగా టైం ఇవ్వండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలి’ అంది. ‘కొత్తగా ఏం అర్థం చేసుకుంటారు. మీరిద్దరూ చాలా ఫ్రెండ్లీగా వుంటారు కదా’ అన్నారు అందరు. ‘అవును మేము ఫ్రెండ్లీగానే ఉంటాము. కానీ పెండ్లి చేసుకోవాలంటే అది మాత్రమే సరిపోదుకదా! బావ ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాడో లేదా అనే విషయం నాకు తెలియాలి. మనసులో మరో అమ్మాయిని పెట్టుకొని నన్ను పెండ్లి చేసుకుంటే మేము సంతోషంగా ఎలా ఉంటాము. అందుకే ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి’ అంది. దానికి అందరూ ఒప్పుకున్నారు. నవ్య రెండు రోజుల తర్వాత కృష్ణతో మాట్లాడితే ‘నేను దీపికను మర్చిపోయాను. ఆమె నా గతం మాత్రమే. ప్రస్తుతం నా మనసులో ఎవరూ లేరు’ అని చెప్పాడు. దాంతో ఆరు నెలల తర్వాత ఇద్దరూ పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసి పెండ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నవ్య, కృష్ణ ఇద్దరూ తమ స్నేహితులకు బ్యాచలర్ పార్టీలు కూడా ఇచ్చారు. నవ్య పూర్తిగా కృష్ణ ప్రేమలో మునిగిపోయింది. ఈ ఆరు నెలల్లో కృష్ణ ఎప్పుడూ దీపిక పేరు ఎత్తలేదు. ‘నేను ఆమెను పూర్తిగా మర్చిపోయాను. అందుకే నీతో పెండ్లికి ఒప్పుకున్నాను’ అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవ్యకు కూడా ఎక్కడా అతనిపై అనుమానం రాలేదు. కానీ పెండ్లి ఇంకా నెల రోజులు ఉండగా కృష్ణ తాను ప్రేమించిన దీపికను తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.
దాంతో నవ్య మానసికంగా కుంగిపోయింది. కృష్ణ తనను ఇంతలా ఎందుకు మోసం చేశాడో తెలియక మదనపడుతోంది. ‘ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి నాలో ఆశలు పుట్టించి ఇలా ఎందుకు వెళ్లిపోయాడు’ అంటూ ఏడుస్తూనే ఉంది. నవ్య తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కూతురిని ఎలా ఓదార్చాలో తెలియక వాళ్లూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ చెల్లి, బావలపై ఎలా ఫిర్యాదు ఎలా చేస్తారు, ఆ పని చేయలేదు. అక్కడ సుభద్ర పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కొడుకు తనతో పాటు నవ్య కుటుంబాన్ని కూడా మోసం చేశాడంటూ ఐద్వా అదాలత్ దగ్గరకు వచ్చింది. మేము వాళ్లందరినీ పిలిపించి మాట్లాడాము. నవ్యకు జరిగిన అన్యాయం గురించి సుభద్రను ఆమె భర్తను అడిగితే… ‘కృష్ణ చేసిన తప్పుకు నవ్య నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను’ అంది ఆమె. ‘ఆమెకు శిక్ష వేస్తే సరిపోతుందా? నా కూతురు జీవితం బాగుపడుతుందా. కొడుకు వద్దంటున్నా బలవంతంగా పెండ్లికి ఒప్పించింది. తన స్వార్థం తాను చూసుకుంది. ఇప్పుడు బలైపోయింది నా బిడ్డ జీవితమే కదా’ అంటూ నవ్య తల్లి గుండెలు బాదుకుంది. మేము కృష్ణను కూడా పిలిపించి మాట్లాడితే అతను ‘నేను దీపికను మర్చిపోవాలనే అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు.
పైగా దీపిక నేను లేకుండా బతకలేనంది. అందుకే ఆమెను పెండ్లి చేసుకున్నాను. నవ్యను నన్ను క్షమించమని అడగటానికి కూడా నాకు అర్హత లేదు. నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేని ఆమెలో నేనే ఆశలు కల్పించాను. ఇప్పుడు నవ్య ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నాడు. దానికి నవ్య ‘నన్ను ఒక వస్తువుగా వాడుకొని ఇప్పుడు ఏం తెలియని అమాయకుల్లా తల్లీ కొడుకులు ఇద్దరూ శిక్షించమంటున్నారా? అసలు నా జీవితంతో ఆడుకోవడానికి మీకు హక్కు ఎక్కడిది? ఈ పెండ్లి వద్దని చెప్పినా కృష్ణ వినకుండా జీవితాంతం కలిసి బతుకుదాం అన్నాడు. కానీ ఇలా మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు. ఇక నేనెప్పుడూ వాళ్ల ముఖాలు చూడను. వాళ్లుకూ నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంది. మేము నవ్యవతో ‘చాలా మంది అమ్మాయిలు ఇలా మోసపోతూనే ఉన్నారు. నువ్వు అనవసరంగా బాధపడకు. ఇలాంటి వ్యక్తి నీ జీవితంలో లేకపోవడమే మంచిది. ఒక వేళ పెండ్లి తర్వాత ఇలా చేస్తే నీ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇప్పుడు జరిగిందంతా నీ మంచికే అని మళ్లీ కొత్త జీవితం ప్రారంభించు. దీని గురించే ఆలోచిస్తూ బాధపడకు’ అని ధైర్యం చెప్పి పంపించాము.
నవ్య పూర్తిగా కృష్ణ ప్రేమలో మునిగిపోయింది. ఈ ఆరు నెలల్లో కృష్ణ ఎప్పుడూ దీపిక పేరు ఎత్తలేదు. ‘నేను ఆమెను పూర్తిగా మర్చిపోయాను. అందుకే నీతో పెండ్లికి ఒప్పుకున్నాను’ అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవ్యకు కూడా ఎక్కడా అతనిపై అనుమానం రాలేదు. కానీ పెండ్లి ఇంకా నెల రోజులు ఉండగా కృష్ణ తాను ప్రేమించిన దీపికను తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.
నవ్యకు సంబంధం చూస్తున్నారని తెలుసుకున్న మేనత్త సుభద్ర ‘ఎవరో కొత్త వ్యక్తి ఎందుకు, మా కృష్ణ ఉన్నాడు కదా! అమ్మాయి కూడా మనకు దగ్గరలో ఉంటుంది. కృష్ణ మీ కండ్ల ముందు పుట్టి పెరిగాడు. వాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణకు, నవ్యకు పెండ్లి చేస్తే బాగుంటుంది



