నామినేషన్‌ దాఖలు చేసిన జైపాల్‌ యాదవ్‌

నవతెలంగాణ-ఆమనగల్‌
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం కల్వకుర్తి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆయన తన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకు ముందు ఆయన పద్మానగర్‌ కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మెన్‌ ఉప్పల వెంకటేష్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, విజితా రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మెన్‌ ఎడ్మ సత్యం, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Spread the love