– ప్రభలుతున్న వ్యాదిపై అధికారులు చర్యలు చేపట్టాలని వినతి
కామెర్ల వ్యాధి విజృంభనపై వైద్య నిపుణులు పట్టించుకోవడం లేదనే ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రాథమికం గా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్ల ప్రజలు కామెర్ల వ్యాదితో అనారోగ్యాలపాలు అవుతున్నట్లు తెలుస్తోంది.సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ,స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం,కూరగాయాల్లో పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉండటం, సాగులో వినియోగిస్తున్న ఎరువులు మోతాదుకు మించడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుందన్నదని గ్రామంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏది ఏమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రజారోగ్యంపై నిరంతరం క్షేత్ర స్థాయిలో సందర్శించి వైద్య చికిత్స,నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలిసిన బాధ్యత పాలకులపై ఉంది.
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో పలువురు యువకులు కామెర్ల వ్యాది భారిన పడ్డారు.పదుల సంఖ్యలో యువకులు కామెర్ల వ్యాది భారిన పడినట్లు వినికిడి.దీంతో గ్రామస్తులో భయానక వాతావరణం నెలకొంది. గ్రామంలో కామెర్ల వ్యాది ప్రభలడంతో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
బెంబేలేత్తిస్తున్న కామెర్లు…
కామెర్ల వ్యాది సోకుతుండడంతో గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రజల్లో ఆందోళన మరింత తీవ్రతరమవుతోంది. పైగా దీని చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరితే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కామెర్లు అంటేనే ప్రజలు భయపడుతున్నారు. కలుషిత నీరు సరఫరా అవ్వడం,త్రాగునీటిని కొని తెచ్చుకుంటున్న ఆర్ఓ ప్లాంట్ల నిర్వహాకులు నిబందనల్లో నిర్లక్యంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఈ వ్యాధి మరింతగా విజృంభిస్తోందన్న విమర్శలు గ్రామంలో వినిపిస్తున్నాయి.వైద్యాధికారు లు, సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి కామెర్ల వ్యాది నివారణకు తగు చర్యలు చేపట్టాల్సిన అవశ్యకత ఉంది.
ఆస్పత్రులకు పరుగులు..
గ్రామంలో సుమారు 20 మంది యువకులు కామెర్ల వ్యాది భారిన పడ్డారు.మరికొంత మందికి ఈ వ్యాది విజృంభించే అవకాశం లేకపోలేదు.దీంతో చేసేదేమిలేక బాధితులు కరీంనగర్ పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.వ్యాది భారిన కొందరు యువకులు చికిత్స పొందుతూ మరికొందరు వ్యాది నుండి ఇప్పుడిప్పుడే కొలుకుని మేరుగుపడుతున్నారు.
గత కొద్దిరోజులుగా బేగంపేట గ్రామంలో యువకులు కామెర్ల వ్యాదిన పడుతున్నారు.కామెర్ల వ్యాది ప్రభలడానికి కారాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైద్యశాఖాధికారులు గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.వైద్య సిబ్బంది తుతూ మంత్రంగా సందర్శించి వెళ్తున్నారు.ప్రజారోగ్యంపై వైద్యాధికారులకు పట్టింపులేదు.గ్రామస్తులందరికి వైద్య పరీక్షలు నిర్వహించి కామెర్ల వ్యాది విజృంభనకు కారాణాలు వెల్లడించాలి.
నూతన కేసులు నమోదవ్వలేదు: వినోద్ బాబ్జీ, వైద్యాధికారి బెజ్జంకి.
కామెర్ల వ్యాది భారినపడిన రోగులను క్షేత్ర స్థాయిలో సందర్శించి లక్షణాలను పరిశీలించాము.ప్రస్తుతం గ్రామంలో నూతన కేసులు నమోదవ్వలేదు.గత కొద్ది రోజుల క్రితం వ్యాది భారిన పడిన రోగులు ఆనారోగ్యం నుండి మేరుగవుతున్నారు.గ్రామంలోని మురికి కాల్వల పరిశుభ్రత,మిషన్ భగీరథ నీటి సరఫరాను క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించాం.