ఏసుక్రీస్తు జీవితం ప్రపంచానికే ఆదర్శం

– ఇన్ఫాంట్‌ జూనియర్‌ కాలేజ్‌
– ప్రిన్సిపాల్‌ తుమ్మ ఫాతిమా రెడ్డి
– కాలేజీలో ఘనంగా జీసస్‌ క్రీస్తు వేడుకలు
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ-శంషాబాద్‌
ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, దయ అనే సుగుణాలు ప్రపంచానికే ఆదర్శమని ఇన్ఫాంట్‌ జీసస్‌ జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ తుమ్మ ఫాతిమారెడ్డి అన్నారు. శనివారం శంషాబాద్‌లోని ఇన్ఫాం ట్‌ జీసస్‌ జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాలలో క్రిస్టమస్‌ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి సామరస్యం నెలకొల్పాలంటే ఏసుక్రీస్తు సూచించిన మార్గాన్ని ప్రజలు అనుసరించాలన్నారు. యేసు సూచించిన విధంగా ఆప దలో ఉన్న అన్నార్తులను ఆదుకోవాలని దయా హృదయా న్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. యేసు త్యాగం ప్రపంచ గమనాన్ని మార్చిందన్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిస్టమస్‌ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ క్రిస్టమస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏసు క్రీస్తు జననం, ప్రపంచ మానవాళి కోసం ఆయన చేసిన సేవల గురించి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.జ్యోతినిర్మల, సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యులు నాగేష్‌, రాధిక, దివ్య, ద్రవికాంత్‌, రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love