‘పది’లో జియాగూడ గౌతమ్‌ మాడల్‌ స్కూల్‌ ప్రభంజనం

నవతెలంగాణ-ధూల్‌పేట్‌
జియాగూడలోని గౌతమ్‌ మాడల్‌ స్కూల్‌ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్ర భంజనం సృష్టించారు. అమ్రాజ్‌ ఐశ్వర్య 9.8 జీపీ, డబ్బికర్‌ కీర్తన 9.2 జీపీ, గోంగూల్‌ అపూర్వ 9.2 జీపీలు సాధించ గా, స్కూల్‌లోని విద్యార్థులందరూ 100శాతం ఉత్తీర్ణతతో విజయం సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను స్కూల్‌ యజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రవీనా జైశ్వాల్‌ మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు 9.8, 9.2 జిపిలను సాధిస్తూ 100శాతం ఉత్తీర్ణత పొందారున్నారు. స్కూల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఉన్నత విద్య రానున్న కాంపిటీషన్లో ఎదుర్కొనే విధంగా విద్యా బోధనలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

Spread the love