దండు మల్కాపురం గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..

నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ సమక్షంలో దండుమల్కాపురం గ్రామం నుంచి కాంగ్రెస్,బిజెపి పార్టీల నుంచి ఆదివారం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.గిర్కటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.మునుగోడు మరింత అభివృద్ధి కావాలంటే కారు గుర్తుపై ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మల్కాపురం సర్పంచ్ ఎలువర్తి యాదగిరి,ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మస్తాన్ బాబు,రైతుబంధు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు బోయిని లింగస్వామి,రామలింగేశ్వర స్వామి కమిటీ చైర్మన్ సుంకరి సత్యనారాయణ గౌడ్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి మహంకాళి పృథ్వి తదితరులు పాల్గొన్నారు
Spread the love