బీఆర్ఎస్ లో చేరిక..

నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ కోళ్ల దుర్గాభవాని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో ఆదివారం బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని అర్బన్ కాలనీ నుండి 30 వ వార్డు 31 వ వార్డు నుండి పలువురు యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బింగి నరేష్ జిల్లా జనరల్ సెక్రెటరీ జువ్వగాని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ లోకి వెళ్లినట్లు తెలిపారు.
Spread the love