జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ అరాచకం..

నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్, ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఓ వ్యక్తిపై భాస్కర్‌ విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. అసలు ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేశాడో తెలియదు. భాస్కర్ మాత్రం విచక్షణ రహితంగా కొట్టాడు. పెద్ద కర్ర తీసుకొని ఎడాపెడా ఇరగదీశాడు. అతను కొట్టడమే కాకుండా తన అనుచరులతో కూడా కొట్టించాడు. ఇక ఈ వీడియోని చూసిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, ఇతరులు ఫైర్ అవుతున్నారు.

Spread the love