జూన్ 2 ఏర్పాట్లను చేపట్టండి: కలెక్టర్

– మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడ కూడా వైలేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలి.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో జూన్ 2  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని జూన్2న చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ సందర్బంగా జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత,  అదనపు ఎస్.పి లు నాగేశ్వర రావు, ఎర్ అదనపు కలేక్టరేట్ ఎస్.పి జనార్దన్ రేడ్డి.లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు  ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడకూడా వేడుకల్లో  కోడ్ వైలేషన్ కాకుండా చూడాలని ముఖ్యంగా ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమ కారుల త్యాగాలు, స్మరించుకోవడం ఉండాలని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ల నుండి జిల్లా పరిషత్ కార్యాలయాలు అలాగే అన్ని మున్సిపాలిటీలలో వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిదంగా కలెక్టరేట్  ఆవరణలో వేడుకలు ఉదయం 9 గంటలకు నిర్వహించాలని అలాగే బయట ఉన్న కార్యాలయాల్లో ఉదయం  వేడుకలు జరుపుకోవలని సూచించారు. ఈ  వేడుకల్లో   శకటాలు, స్టాల్ల్స్, ఆస్తుల పంపిణీ లాంటివి చేపట్టరాదని అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో తక్కువ బృందాలతో చేపట్టాలని, ఎక్కడకూడా ప్లాగ్ కోడ్ 2002 ననుసరించి ప్లాస్టిక్ జెండాలు ఆవిష్కరణలో చేపట్టారదని సూచించారు.శాసన మండలి ఎన్నికలు అధికారులు, సిబ్బంది అందరూ సమర్థవంతంగా ఎక్కడకూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా  విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమంలో  సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, డి.ఈ. ఓ అశోక్, డి.పి.ఓ సురేష్ కుమార్, సి.పి.ఓ కిషన్, డి.ఎస్.ఓ మోహన్ బాబు, dwo వెంకటరమణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love