లైంగిక దాడి.. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ అరెస్ట్..

నవతెలంగాణ – మహాదేవపూర్/ మల్హర్ రావు
శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకిలే విధులు మరిచి రాసలీలల్లో మునిగి తేలుతుండటంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు పోలీసులు అంటేనే నమ్మకం పోతుంది. ఓ వైపు డైనమిక్ అధికారి మల్టీ జోన్ ఐజి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం అధికార పార్టీ నాయకుల అండదండలు వున్నాయని అరచాకాలు సృష్టిస్తూ ఎవరు ఏం చేయలేరనే విధంగా వ్యవహరిస్తున్నారు.స్వంత డిపార్ట్ మెంట్ లో పై స్థాయి సర్కిల్ అధికారి నియంత్రణ లేకనే కిందిస్థాయి అధికారులు, సిబ్బంది రెచ్చిపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కొన్ని చోట్ల కీచక అధికారుల బాగోతాలు బయటకు వస్తున్నా.. మరికొన్ని చోట్ల పెద్దల పైరవీలతో నీరుగారిపోతున్నాయి.తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఠాణా లో పని చేస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సదరు మహిళా కానిస్టేబుల్ పలు మార్లు తమ పై అధికారికి మౌఖికంగా పిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోగా చివరకు సర్వీస్ రివాల్వార్ ఎక్కుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళ కానిస్టేబుల్ నేరుగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోలీసు బాస్ లకు పిర్యాదు చేసింది.దీంతో ఉన్నత అధికారుల ఆదేశంతో జిల్లాలోని భూపాలపల్లి, కాటారం డీఎస్పిల ఆద్వర్యంలో పోలీసులు మంగళవారం అర్థరాత్రి కాళేశ్వరం కన్నేపల్లి క్వార్టర్ లో ఎస్సై భవాని సేన్ ను అరెస్ట్ చేసి భూపాలపల్లి ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.
ఉద్యోగం నుంచి సస్పెండ్..
ఎస్ఐని భవాని సేన్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఐజి రంగానాథ్ ప్రకటించారు. గతంలో ఈ ఎస్ఐ పని చేసిన ఠాణాల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి. కంపిటేటివ్ పరీక్షలకు బుక్స్ ఇస్తామని ఓ అమ్మాయిని లైoగీక వేధింపులకు గురి చేయడం, ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడంతో కీచక బాగోతం బయట పడింది.అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇలాంటి కీచక అధికారుల చేష్టలతో మహిళ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలంటే జంకుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
Spread the love