నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని కల్వలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంటెపాక లలిత అయోధ్య శనివారం కొరటికల్ గ్రామంలో నామినేషన్ ను వేశారు. ఈ సందర్భంగా వంటెపాక లలిత మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామంలోని ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు. గతంలో గ్రామంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా గ్రామంలో అనేక సంక్షేమ పథకాలను గ్రామ ప్రజల కోసం చేసిన తమకు మరోసారి గ్రామ ప్రజల సేవ చేసేందుకు అవకాశం ఇస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలోని ప్రజలు మాయమాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోకుండా నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి అవకాశాలు ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరారు.
కల్వలపల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -



