నవతెలంగాణ – మంథని
ఉచిత నేత్ర వైద్య శిభిరంతో పాటు పేద ప్రజలకు అండగా ఉంటూ కమాన్ పూర్ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు ప్రశంసనీయమని మంథని ఆర్.డి.వో.హనుమా నాయక్ అన్నారు. మంథని డివిజన్ పరిధిలోనికమాన్ పూర్ మండలంలోని జూలపల్లి (ఆదర్శనగర్ )లోని సాన గార్డెన్ లో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్,రేకుర్తి ఉదారత ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని హార్డీవో హనుమాన్ నాయక్ హాజరై మాట్లాడారు. కమాన్ పూర్ లయన్స్ క్లబ్ ఏర్పటైన ఏడాది కాలంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉత్తమ క్లబ్ గా గుర్తింపు పొంది అవార్డు అందుకున్నాదంటే వీరి సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందాన్నారు. అలాగే సదాశాయ పౌండేషన్ కూడ మరణానంతరం దాతల నుండి నేత్రాలు సేకరించి చూపు లేని వారికి ఎందరికో చూపును ప్రసాధించేలా కృషి చేస్తున్నారన్నారు.
ఈ రెండు సేవ సంస్థలు సంయుక్తంగా సేవ కార్యక్రమాలలో వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందాన్నారు.ఇక ముందు కూడ ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్ డి వో హనుమా నాయక్,తహసీల్దార్ ఆరిపోద్దీన్ లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి పరీక్ష అవసరమైన 40 మందిని ప్రత్యేక బస్సులో రేకుర్తి ఉదారత ఆసుపత్రికి తరలించారు.వీరికి కేవలం రూ.220 లు మాత్రమే నామ మాత్రపు ఫీజుతో ఉచిత కంటి ఆఫరేషన్,భోజనం, వసతి,ప్రయాణం, మందులు ఉచితమేనని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణరెడ్డి వెల్లడించారు. అలాగే రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ చింతల ప్రభాకర్ కంటి పరీక్షలు నిర్వహించారు. చైర్మన్ కొండ వేణుమూర్తి,వైస్ చైర్మన్ చిగుర సురేష్ సహకారంతో కమాన్ పూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆరిపోద్దీన్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎస్.ఎం.ఎస్.పి.వో నూక రమేష్,లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్ అధ్యక్షులు సాన రామకృష్ణ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, కోశాధికారి డా,విజయ్ కుమార్,సదాశాయ పౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, లయన్స్ క్లబ్ సభ్యులు బండ సాయి శంకర్ బొజ్జ రాజసాగర్,జబ్బార్ ఖాన్, బొజ్జనర్సింహాచారి,పొన్నం నవీన్ కుమార్,చదువు వెంకట్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.