‘కసిరెడ్డి నారాయణరెడ్డిని గెలిపించాలి’

నవతెలంగాణ-తలకొండపల్లి
కల్వకుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు రమేష్‌నాయక్‌ కోరారు. గురువారం తలకొండపల్లిలోని పెద్దూర్‌ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశాడని అన్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలని అమలు చేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. వీటిపై ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘునాయక్‌, వార్డ్‌ మెంబర్‌ శ్రీనునాయక్‌, రాహుల్‌, శ్రీనునాయక్‌, నవీన్‌, లక్య నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love