పలు కుటుంబాలకు కత్తి కార్తీక పరామర్శ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
దుబ్బాక మండల పరిధిలో పద్మనాభునిపల్లి గ్రామ సర్పంచ్ కండ్లకోయ పర్షారాములు తండ్రి రాజయ్య (70) గుండెపోటుతో మృతి చెందారు. అలాగే హాబ్సిపూర్ గ్రామానికి చెందిన అబ్బుల యాదమ్మ (50) గుండె పోటు తో మృతి చెందారు.ఈ  విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యుల్ని శుక్రవారం కలిసి పరామర్శించారు.
కార్యక్రమంలో దేవస్వామి (ఓబీసీ మండల్ ప్రెసిడెంట్,దుబ్బాక), కొత్త దేవి రెడ్డి (బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నల్ శ్రీనివాసరావు , ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love