– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– రాయపోల్, పోల్కంపల్లి గ్రామపంచాయతీ భవనాల ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పల్లె సీమల రూపురేఖలు మార్చిన ఘనత కేసీ ఆర్‌కే దక్కిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మం డల పరిధిలోని రాయపోల్, ముకునూర్, పోల్కంపల్లి, నాగన్పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు నూ తన గ్రామపంచాయతీ భవనాలను స్థానిక ప్రజాప్ర తినిధులతో కలిసి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఉద యం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కేసీఆర్ నాయ కత్వంలో పల్లెలన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయ న్నారు. గత ప్రభుత్వాల హయాంలో నోచుకోలేని గ్రామాలు నేడు కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యా మలంగా మారుతున్నాయని చెప్పారు. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ పాల నలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపో తున్నాయని అన్నారు. ప్రభుత్వం గూడాలను, తండా లను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాకుండా నూతన గ్రామపంచాయతీ భవనాలను పెద్ద ఎత్తున నిర్మించిందన్నారు. ఎక్కడ చూసినా పచ్చ దనంతో కళకళలాడుతున్నాయని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను మంజూరు చేస్తుందని చెప్పారు. అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం దండుమైలారం లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.కృపేష్, జడ్పీటీసీ మహిపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, సర్పంచులు గంగిరెడ్డి బలవం త్‌రెడ్డి, చెరుకూరి అండాలుగిరి, శివరాల జ్యోతి, రావ నమోని మల్లీశ్వరి జంగయ్య, ఎర్ర జగన్, ఎంపీటీ సీలు గంగిరెడ్డి జ్యోతి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి మంగ రవీందర్, అచ్చన శ్రీశైలం, ఉపసర్పంచ్ అచ్చన బాల్‌రాజ్, జంగారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలుగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.