నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని లేదా ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం గాంధీ భవన్ నుంచి హైదరాబాద్‌లోని గన్ పార్క్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసనలో భాగంగా, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌ను ‘కుంభకర్ణ’ వేషంలో చూపిస్తున్న ఒక పెద్ద పోస్టర్‌ను ప్రదర్శించారు. కేసీఆర్ ది కుంభకర్ణ లాంటి మొద్దు నిద్ర అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేశారు. “కె” అంటే కుంభకర్ణ, “సి” అంటే చంద్రశేఖర్, “ఆర్” అంటే రావు అని వ్యంగ్యంగా నినాదాలు చేశారు. వెయి రోజులలో కాంగ్రెస్ విజయాలు సాధిస్తే..కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఉంటూ, అధిక భద్రతను అనుభవిస్తూ జీతం తీసుకుంటున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
కేసీఆర్ ది కుంభకర్ణ నిద్ర: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



