Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెకండ్ల వ్యవధిలోనే యూరియా స్టాక్ ఖాతం.. 

సెకండ్ల వ్యవధిలోనే యూరియా స్టాక్ ఖాతం.. 

- Advertisement -

– రైతుల ఆందోళన, ధర్నా, రాస్తారోకో..
– యాప్ విధానాన్ని రద్దు చేసి, షరతులు లేకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్..
– దేశం కోసం ధర్మం కోసం కాదు.. ముందుగా రైతుల కోసం చేయాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి 

ఇందల్ వాయి సహకార సోసైటి  పరిధిలోని గన్నారం గ్రామంలో శుక్రవారం యూరియా కోసం ఆన్‌లైన్‌లో స్టాక్ అందుబాటులో ఉంచిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే స్టాక్ పూర్తిగా అయిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై ఎరువుల గోదాంకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. అక్కడి నుండి జాతీయ రహదారి 44 వరకు వచ్చి గ్రామ స్వాగత తోరణాం వద్ద నిరసన వ్యక్తం చేసి తర్వాత అక్కడ నుండి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి.. సర్విస్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో యూరియా స్టాక్ పెట్టిన కోన్ని సెకండ్ల లోనే స్టాక్ ఖాళీ కావడంతో ఇబ్బందులు పడ్డామని,వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు అవసరమైన ఎరువులను ఆన్‌లైన్ లేదా యాప్ విధానం ద్వారా పరిమితంగా అందించడం వల్లనే అనేక మంది రైతులకు యూరియా అందడం లేదని తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే స్టాక్ పూర్తవుతుండటంతో రైతులు యూరియా పొందలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తిసుకువచ్చిన యాప్ కోద్దిగా ఇబ్బందులు పడ్డా తర్వాత బాగానే ఉందని, నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన యూరియా యాప్ లో పబుయిస్టంగాలోక భూయిష్టంగా ఉందని, వెంటనే ఈ యాప్ ను రద్దుచేసి ఈ గ్రామానికి సంబంధించిన యూరియా ను అదే గ్రామానికి చెందిన రైతులకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే కేంద్ర నాయకులు దేశంలోని అందరికీ అన్నం పెట్టే రైతులకు యారియా సమయానికి ఇవ్వకుండా  ఇబ్బందులకు గురి చేస్తుందని రైతుల ఆరోపించారు. ఏమి తెలియని కోందరు రైతులకు స్మార్ట్ ఫోన్ లో బుకింగ్ ఏలా చేస్తారని ప్రశ్నించారు. 

వరి చివరి దశకు చేరిందని ఈ దశలోనే పంట పొలం కు యూరియా అత్యంత అవసరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని వెంటనే యాప్ను రద్దుచేసి పాత పద్ధతిలోనే క్రయావిక్రయాలు చేపట్టాలన్నారు.

విషయం తెలుసుకున్న ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ సుమలత ఆందోళన కారుల వద్దకు పోలిస్ సిబ్బంది తో చేరుకుని, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ కు ,సోసైటి చైర్మన్,సిఈఓ లకు సమాచారం అందజేశారు.

మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా యాప్ తీసుకురావడంతో ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ  ఇందల్వాయి సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు, గన్నారం కు900 యూరియ సంచులు వచ్చాయని, రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని  పేర్కొన్నారు.సంబంధిత అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు , ఎంపీ ఎమ్మెల్యే లు దీనిపై దృష్టి కేంద్రీకరించి రైతుల ఇబ్బందులు తీర్చాల్సిన భద్యత ఉందన్నారు. సహకార సొసైటీ నుండి ఎన్ని యూరియా బస్తాలు కోనుగోలు  చేయడానికి సిద్ధంగా ఉన్నామని యాప్ వల్లనే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.ఇందల్వాయి మండలంలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు యూరియా కోటాను కేటాయించాలని డిమాండ్ చేశారు.

 రైతులు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు విజ్ఞప్తి యాప్ ను రద్దు చేయాలని సూచించారు. గతంలో మాదిరిగానే ఎటువంటి ఇబ్బందులు, అదనపు షరతులు లేకుండా రైతులకు అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేయాలని కోరారు.రైతుల అవసరాలకు అనుగుణంగా సహకార సంఘాలకు తగినంత యూరియా నిల్వలను కేటాయించి, ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుతున్న పరిమిత స్టాక్ కేవలం సెకండ్ల వ్యవధిలోనే పూర్తవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రైతులందరి తరఫున ఒకే డిమాండ్ ఉందని యాప్‌, ఆన్‌లైన్ పరిమితులు, అనవసరమైన షరతులు లేకుండా గతంలో మాదిరిగానే రైతులకు సకాలంలో, అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నాట్లు వివరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రైతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -