కృష్ణా జల్లాల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కోల్పోయిన కేసీఆర్…

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కృష్ణాజిల్లాలపై మాట్లాడే కనీస నైతిక అర్హతను కూడా కేసీఆర్ కోల్పోయారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు.బుదవారం ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ జన సమితి నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ లో నిర్వహించే కృష్ణా జలాల్లో నాణ్యమైన వాటా కేంద్ర ప్రభుత్వ వివక్షత బి.ఆర్.ఎస్ నిర్లక్ష్యము దగాపడ్డ నల్గొండ  సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సూర్యాపేట నియోజకవర్గ జన సమితి సమన్వయ కమిటీ విడుదల చేసిన పోస్టర్  ఆవిష్కరణ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ పోరాటమంతా నీళ్ల కోసమేనని నల్లగొండ గోసంత నీళ్ల కోసమే అని తెలంగాణ సాధించిన తర్వాత ఆ ఘోష తీరుతుందని భావిస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం కృష్ణాజిల్లాలో రావాల్సిన న్యాయమైన వాటాను దక్కకుండా కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని  విమర్శించారు .2014 విభజన హామీల మేరకైనా కృష్ణాజిల్లా న్యాయమైన వాటా ఇవ్వకుండా మొత్తం జల వనరుల మీద కేంద్ర ప్రభుత్వం తన గుత్తాధిపత్యం కొరకు గెజిట్ తీసుకువస్తే ఆరోజు కెసిఆర్ మౌనంగా ఉన్నాడని ఆయన ఆరోపించారు .కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన గెజిట్ తో. కృష్ణా పరివాహక ప్రాంతం ప్రాజెక్ట్ లపై అధికారం కొల్పోతామని తెలిసినా నాడు తాను తన అనుచరులు చేసిన అక్రమాలు నుండి రక్షణ పొందేందుకు కేంద్రానికి వత్తాసు పలికారని ధర్మార్జున్ విమర్శించారు. తెలంగాణ జన సమితి ఈ విషయాలను ముందు నుండే హెచ్చరిస్తూ పాదయాత్రలు నిర్వహించి కృష్ణా జలాల పరిరక్షణకై ఉద్యమం చేసిందని  అన్నారు. నాడు  రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసిన ప్పటికి అధికారం మత్తులో జోగుతున్న కేసిఆర్ కు నాడు చెవికెక్కలేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 2023 జనవరి 30న దీక్ష చేపట్టిన విషయాన్ని   ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడేమో గోదావరి జలాల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రధానంగా కాలేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బట్టబయలై జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు నేడు కృష్ణాజిల్లాలపై కృత్రిమ హంగామా సృష్టిస్తున్నారని ధర్మార్జునే ఎద్దేవా చేశారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిణ కిరణ్ కుమార్, రైతు సమితి జిల్లా కోకనినర్ సూర్యనారాయణ ,పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్ ,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మ గాని వినయ్ గౌడ్ చివేముల మండల అధ్యక్షులు సుమన్ నాయక్ సూర్యాపేట మండల కోఆర్డినేటర్ వలికి రాజు ,పెన్మాడ్ మండల నాయకులు సతీష్ ,ఆత్మకూరు మండల నాయకులు ఎస్టి సెల్ జిల్లా కార్యదర్శి మూడు  మల్సూర్ నాయక్ పట్టణ కన్వీనర్ దేవత్  సతీష్ ,ఎస్ సి సెల్  జిల్లానాయకులు బల్గురి గోపి పట్టణ ఉపాధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు..
Spread the love