మంత్రి సత్యవతి రాథోడ్‌ చేతిపై కేసీఆర్‌ పేరు పచ్చ బొట్టు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో మంత్రి సత్యవతి రాథోడ్‌ తన చేతిపై కేసీఆర్‌ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురం భీమ్‌ సహచరుని వారసులతో పచ్చబొట్టును వేయించుకున్నారు. బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో జరుగుతున్న గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో శనివారం మంత్రి పాల్గొన్నారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటోఎగ్జిబిషన్‌, స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు.

Spread the love