ఆర్టీసీ ఈడీ యాదగిరి ఉద్యోగ విరమణ

– సేవల్ని కొనియాడిన ఎమ్‌డీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనకు సహచర ఉద్యోగులు, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యాదగిరి సంస్థకు చేసిన సేవల్ని ఎమ్‌డీ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆర్టీసీకి 36 ఏండ్లపాటు సేవలందించారని తెలిపారు. హైదరాబాద్‌లోని రాణిగంజ్‌ డిపోలో బుధవారం ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీగా యాదగిరి కేఎంపీఎల్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో చాలా కూల్‌గా పనిచేసి..
మంచి ఫలితాలను తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్‌ రవీందర్‌, హైదరాబాద్‌ ఈడీ పురుషోత్తం, సీపీఎం కష్ణకాంత్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి ఆర్‌ఎంలు వెంకన్న, వరప్రసాద్‌, శ్రీధర్‌, మాజీ ఈడీలు వేణు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
బస్‌ భవన్‌ లో 8 మంది ఉద్యోగ విరమణ
హైదరాబాద్‌ బస్‌భవన్‌లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో వారి వీడ్కోలు కార్యక్రమాన్ని యాజమాన్యం నిర్వహించింది. ఉద్యోగ విరమణ పొందిన వారిలో వీవీఎస్‌ సత్యనారాయణ(డిప్యూటీ సీటీఎం), ఎండీ రఫీ(డిప్యూటీ సూపరింటెండెంట్‌), ఎస్‌. ఎన్‌. రావు (టీటీఐ), డి.భాస్కర్‌ రావు(సీనియర్‌ అసిస్టెంట్‌), ఎస్‌. శ్రీనివాస్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌), కె.మల్లయ్య(డ్రైవర్‌), మన్సూర్‌ అలీ (లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌), జి.కష్ణ(డబ్ల్యూ.ఐ)లు ఉన్నారు. వీరందరినీ సంస్థ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ సన్మానించారు. విధి నిర్వహణలో వారి నిబద్ధతను కొనియాడారు.

Spread the love