అద్దె బస్సు కార్మికుల జీతాలు పెంచాలి

– సీఐటీయూ దశల వారీ పోరాటంతో దిగివచ్చిన అధికారులు.
– ఆర్టీసీ అధికారులు, జిల్లా కార్మిక శాఖ అధికారులతో చర్చలు ప్రారంభం.
నవతెలంగాణ-కొత్తగూడెం
అద్దె బస్సు కార్మికులకు జీతాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజుల నుండి ఆర్టీసీ అద్దె బస్సు కార్మికులు శాంతి యుతంగా పోరాటాలు చేస్తుంటే అద్దె బస్సు యజమానులు, ఆర్టీసీ అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై సిఐటియు నాయకులు లేబర్‌ ఆఫీసర్‌ని కలిసినట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు. అద్దె బస్సు కార్మికులు చేస్తున్న పోరాటానికి చర్చలకు బస్సు యజమానులు సిద్ధంగా లేరని జిల్లా లేబర్‌ ఆఫీసర్‌కి వినతి పత్రాన్ని సమర్పించినట్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్‌ తెలిపారు. కొంత మేరకు స్పందించిన ఆర్టీసీ అధికారులు వారి పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని, లేబర్‌ ఆఫీసర్‌ ముందు చర్చల్లో చెప్పారు. జీతాలు పెంపుదల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న బస్సు యజమానులతో జూన్‌ 6వ తేదీన ఆర్టీసీ డిపో మేనేజర్‌ వద్ద చర్చలు ఉంటాయని జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ షర్ఫీద్దీన్‌ తెలిపారు. ఈ చర్చల్లో ఆర్టీసీ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ చారి, సీఐటీయూ, అద్దె బస్సుల నాయకులు భూక్యా రమేష్‌, నరసింహ, సైదులు, శ్రీకాంత్‌, నవీన్‌, ఆది నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love