ఇంటర్‌ విద్యా ఫోరంలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫోరం విలీనం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీజీవో ఇంటర్‌ విద్యా ఫోరంలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫోరం (సీఎల్‌ఎఫ్‌) విలీనమైంది. టీజీవో అధ్యక్షురాలు వి మమత సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ నాయకులు పలువురు చేరారు. సీఎల్‌ఎఫ్‌ను రద్దు చేస్తున్నట్టు ఆ ఫోరం కన్వీనర్‌ సయ్యద్‌ జబీ ఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నగర అధ్యక్షులు కృష్ణయాదవ్‌, నాయకులు వెంకట్‌, ఇంటర్‌ విద్యా ఫోరం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు అస్నాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love