ఏపీలో ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో పూర్తిస్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టోను ఎన్డీయే విడుదల చేసింది. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక పింఛను రూ.4వేలకు పెంచుతూ 2024 ఏప్రిల్‌ నుంచే వర్తింప చేయడం, బీసీలకు 50 ఏళ్లకే పింఛను. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేల సాయం, రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి తదితర హామీలను మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పవన్‌, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Spread the love