అసంఘటిత కార్మికులకు ఆర్థిక భద్రత ఈ శ్రమ్ కార్డు

– సంఘటిత కార్మికులకు సమాన ప్రయోజనాలు
– ప్రభుత్వం నుంచి సులభంగా ప్రయోజనం పొందే అవకాశం.
– మేడే సందర్భంగా ఈ శ్రమ్ కార్డుపై నవ తెలంగాణ ప్రత్యేక కథనం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఈ శ్రమ్  కార్డు అసంఘటిత రంగులోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో  సమానంగా ప్రయోజనాలు కల్పించెందుకు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఈ శ్రమ్ పోర్టల్ ను ప్రారంబించింది.ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ పథకాలు వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.ఇందుకోసం కూలీలకు ఈ శ్రమ్ కార్డులు అందజేస్తున్నారు.ప్రభుత్వ పథకాల నుంచి సులభంగా ఉపాది పొందే అవకాశం చూపుతున్నారు.
ఈ శ్రమ్ కార్డు అంటే ఏమిటి.?
ఈ శ్రమ్ కార్డు అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు.ఇది కార్మికుడు అసంఘటిత రంగంలోని వాడనని రుజువు చేస్తోంది.ఇప్పుడు కార్మికులు తమ ప్రయోజనాలను పొందేందుకు  పెద్దగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు.దీన్ని చూపిండడం,లేదా సమర్పించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు అందుతాయి.
ఈ శ్రమ్ కార్డు ప్రయోజనాలు ఏంటి.,? 
ఈ శ్రమ్  కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాది పొందడం సులభం అవుతుంది. డేటాబేస్ లో వారికి సంబంధించిన డేటా వల్ల వారు ఆపనిని సులభంగా పొందుతారు.ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదైన కార్మికుడి రూ.2 లక్షల ప్రమాదభిమా కవరేజ్ ఉంటుంది.పోర్టల్ లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే ,మరణం లేదా అంగవైకల్యం కలిగి  ఉంటే ఈ బీమా పథకం కింద  లక్ష రూపాయలకి అర్హులు.ఈ కార్డు సహాయంతో అసంఘటిత రంగ కార్మికులకు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన స్వయం ఉపాధి కోసం జాతీయ పింఛన్ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి  బిమా యోజన్ పథకం,ప్రధానమంత్రి సురక్ష యోజన అటల్ పెన్షన్ యోజన,ప్రజా పంపిణీ వ్యవస్థ ,ప్రధానమంత్రి అవాస్ యోజన, జాతీయ ప్రభుత్వ పథకాలైన సామాజిక సహాయ పథకం, అయిస్మాన్ భారత్, నేత కార్మికులకు ఆరోగ్య పథకం.ప్రధానమంత్రి కౌశల్ విటాస్ యోజన, ప్రధానమంత్రి ఉపాది కల్పన పథకం వంటి వాటి ద్వారా ప్రయోజనం పొందుతారు.
నమోదు ప్రక్రియ షరతులు..
అసంఘటిత రంగంలో పనిచేసే 16 నుంచి 59 సంవత్సరాలవయస్సు గల ఎవరైనా ఈ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు.వర్లర్ స్వయంగా లేదా ఈ శ్రమ్  పోర్టల్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.నమోదు పూర్తిగా ఉచితం.కార్మికులు పోర్టల్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు.
ఏయే పత్రాలు అవసరవుతాయి..
పోర్టల్ రిజిస్ట్రేషన్ కోసం కార్మికులు పెరు,వృత్తి,చిరునామా, విద్యార్హత, నైపుణ్యం వంటి సమాచారాన్ని అందించాలి.రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ ను నమోదు చేసిన వెంటనే అక్కడ ఉన్న డేటా బేస్ నుంచీ వర్కర్ మొత్తం సమాచారం.పోర్టల్ లో స్వయంచాలకంగా కనిపిస్తోంది.వ్యక్తి మిగిలిన అవసరమైన సమాచారాన్ని పురించాలి.కార్మికుడు ఈ శ్రమ్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్,ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా అవసరం.ఒక కార్మికుడుకి ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేకపోతే అతను/ ఆమె,సమీపంలోని (అవాజ) సందర్షించి బయోమెట్రిక్ ప్రామాణికరణ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
Spread the love