నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు మంగళవారం ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చూసిన పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700 – రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.150-రూ.200గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.