కరిగిన మంచు.. రష్యాను ముంచిన వరదలు

నవతెలంగాణ- హైదరాబాద్: రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్‌ పర్వతాల్లోరికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉద్ధృతికి మాస్కోకు తూర్పున 1,800 కిలోమీరట్ల దూరంలో ఉన్న ఓర్స్క్‌ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది.  దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. భారీ మొత్తంలో నీరు సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశించింది. సుమారు 10వేలకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి. సైబీరియా, వోల్గా, రష్యాలోని మధ్య ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఆ వేడికి మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 39 ప్రాంతాల్లో 10,400 కంటే ఎక్కువ ఇళ్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Spread the love