మారని బతుకులపై క్రోధాగ్ని

చరిత్ర పునరావృత్తం అయినట్లు
చక్రంలో ఆకుల్లా అరవై ఏళ్ళ ప్రౌడిమ
క్రోధి కన్నెయ ఎన్నికల(ల్ని) మోసుకొచ్చింది

సర్వదినాల్ని పర్వదినాలుగా తీర్చే మహాత్తర
సిద్ధాంతాన్ని వెనక్కి నెట్టి నేతల్ని నేరరాల్చే
ఓటుతంత్రం చెప్పకనే చెప్పింది

నేతను..నోటును.. ఓటు తంత్రంతో కూల్చమంది
కంటికి కనిపించే ముద్దనోటికి  అందని
యుగయుగాల దోపిడి – బానిస జీవితాల్ని
తరతరాలుగా అనుభవించే అన్నార్తులు
మౌన యుధ్ధాన్ని వసంత కాల మేఘ గర్జన మేల్కొల్పింది

మోడు వారిన తరువులను చిగురింపజేసే ఆమని
మా “నవ” బతుకుల్లోనూ..శిశిరం వీడిన వసంతం విరాజిల్లాలి.!

మతంతో మనువాదపు మనువు
కనే వేయి పడగల విషనాగులు
కోరలు పీకే కార్మిక రాజ్యం రావాలి ! కావాలి .!

మమత, సమత, మానవత
సుగంధాలు దేశదేహమంతా వెదజల్లాలి
మత్సరాలు లేని వత్సరం  అంతా సాగాలి
షడ్రుచులూ సామాన్యుడూ గ్రోలేలా క్రోధి!
క్రొత్త సంవత్సరం అంతా సాగాలి..!

                                                                 – తంగిరాల చక్రవర్తి
                                                              ఫోన్ : 9393804472

Spread the love