నవతెలంగాణ – మల్హర్ రావు,(కాటారం)
పెద్దపెల్లి పార్లమెంట్ టికెట్ అధిక జనాభా ఉన్న మాదిగలకు ఇవ్వకుండా తక్కువ జనాభా ఉన్న మాలలకు ఇవ్వడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం కాటారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతేన చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మాదిగలని మోసం చేసిందని,మాదిగలను జనాభా లెక్కలో లేకుండా చేస్తుందన్నారు.13 శాతం ఉన్న మాదిగలకు (80 లక్షలు మంది) 1 ఎంపీ సిటు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో ఒక్క సీటు కూడ మాదిగలకు కేటాయించక పోవడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ పార్టీ పూర్తిగ మాలల పార్టీగా మారిందన్నారు. మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ పాలనను ప్రోత్సహిస్తూ పెద్దపల్లి సీటు గడ్డం బ్రదర్స్ కొడుకు వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకి కేటాయించడం జరిగిందన్నారు.ఒక కుటుంబానికి ఇప్పటికే రెండు ఎమ్మెల్యే పదవులు ఉన్నప్పటికీ మళ్లీ అదే కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు.రానున్న ఎన్నికల్లో మాకు ప్రాతినిథ్యం లేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తాం మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటదో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు మంతెన శ్రావణ్ మాదిగ, సమైక్య కార్యదర్శి కోరండ్ల సాయికుమార్ మాదిగ,చిపెల్లి చిన్న మాదిగ,సకినారపు సమ్మన్న మాదిగ,మంథని రాజబాబు మాదిగ పాల్గొన్నారు.