యువగళం పాదయాత్రలో రాళ్ల దాడి…

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే, భీమవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాడేరు వద్ద లోకేశ్ పాదయాత్ర కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. యువగళం కాన్వాయ్ లోని పలు వాహనాలను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలే రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు ముందుకు కదిలేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఇది పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న భవనాలు ఎక్కి రాళ్ల దాడి చేశారని, కవ్విస్తూ జెండాలు ఊపారని, ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తలకు రక్షణగా నిలిచారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Spread the love