నవతెలంగాణ -హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్ లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అందుకే తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే ఉత్తమ నమూనా అంటూ ట్వీట్ చేశారు.