– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపి, మార్క్‌ఫెడ్ ఎమ్‌డీ సత్యనారాయణ, అగ్రోస్ ఎమ్‌డీ రాములు, టెస్‌కాబ్ ఎమ్‌డీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఎరువుల స్థితిగతులపై సమీక్షించారు. అన్ని రకాల ఎరువులను గ్రామస్థాయికి చేర్చాలని కోరారు. అందుకోసం అన్ని నోడల్ ఎజెన్సీ, ఎరువుల కంపెనీలతో చర్చించి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈనెల 9న లారీల సమ్మె కారణంగా నిర్మల్ జిల్లాల్లో ఎరువుల సరఫరాలో జాప్యం జరిగిందని వివరించారు. ప్రాంతాలు, పంటలవారీగా సమీక్షలు నిర్వహించి, అక్కడి కావాల్సిన ఎరువులు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.