కిడ్నాప్ వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు: సీఐ ఏర్రల్ల కిరణ్ 

నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్
సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు  పెట్టీ ప్రజలలో వదంతులు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ సీఐ ఏర్రల్ల కిరణ్  హెచ్చరించారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాట్సప్ గ్రూపులలో తప్పుడు పోస్ట్లు పెట్టి,  ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్నా వారిపై నిఘా పెట్టామన్నారు. జనాలను భయబ్రాంతులకు గురిచేస్తే ఉపేక్షించమని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన, పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. హుస్నాబాద్ లో ఎలాంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదనీ,  ప్రజలు పుకార్లు నమ్మొద్దని అన్నారు. అనుమానితులు కనిపిస్తే 100 సమాచారం ఇవ్వలని అన్నారు.
Spread the love