– మాజీ సర్పంచ్ జిల్లా శోభ రాములు
– నల్లవెల్లి లో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-యాచారం
ప్రజలంతా కారు గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా నాలుగోసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించాలని మాజీ సర్పంచ్ జిల్లా శోభ రాములు కోరారు. శనివారం యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి లో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వేయాలని కోరారు. గ్రామంలో ఉన్న వద్ధులు, రైతులు కారు గుర్తును మరువద్దని సూచించారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివద్ధి ఎంతో జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.