ప్ర‌పంచ క్రికెట్‌లో కివీస్ బౌల‌ర్ పెను సంచ‌ల‌నం..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్ర‌పంచ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఫెర్గూస‌న్ 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌లేదు. 4కి 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేశాడు. అంతేగాక 3 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవే. అలాగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇలా 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా కూడా ఫెర్గూస‌న్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జ‌రిగిన మ్యాచులో కివీస్ ఈ న‌యా రికార్డు అందుకున్నాడు. గ‌తంలో కెన‌డాకు చెందిన సాద్ బిన్ జ‌ఫ‌ర్ కూడా 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు.

Spread the love