– మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నవతెలంగాణ-నస్పూర్
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆహర్ణిషలు తపించిన ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్‌బాపూజీఅని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సబావాత్ మోతిలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్‌లతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను కాపాడుతూ వారి ఆశయాలను భావితరాలకు అందించాలని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అని, మహనీయుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం, నాయకులు గుండేటి యోగేశ్వర్, చిలగాని సుదర్శన్, గడ్డం సుధాకర్, బండి మల్లికార్జున్, దోమల రమేష్, టీపీసీసీ జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్, బీసీ సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నస్పూర్ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య, శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న అన్నారు. తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు శుక్రవారం నస్పూర్ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం వేముల సురేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలువేరు సదానందం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, బొడ్డున రామ్మూర్తి, చిలువేరు శరబంధం, కుందారపు రాములు, కుందారపు రమేష్, క్యాతం రాజేష్, యాదగిరి, సత్యనారాయణ, అనిల్ కుమార్, వీరన్న పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు,ఆర్‌ఓ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జీఎం కార్యాలయంలోకొండ లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, పాల్గొన్నారు.
జన్నారం : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కెఏ నరసింహులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ కడార్ల నరసయ్య, జిల్లా కోకన్వీనర్ బాలసాని శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. అదేవిదంగా తహసీల్దార్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
మందమర్రి : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఒటు జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, సీఎంఒఐ సెక్రటరీ పైడీశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివై పీఎం ఆసిఫ్, హెచ్‌ఒడీలు, జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళుఅర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ శ్యాంసుందర్, ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ బంగారి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు రాజేందర్ పాల్గొన్నారు.
హాజీపూర్ : స్వతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి వేడుకలు మండంలలో ఘనంగా నిర్వహించారు.13వ బెటాలియన్‌లో కమండెంట్ పీ.రాములు బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు కుటుంబరావు, అంకం కృష్ణమూర్తి, వెంకటి, బింగి శ్రీకాంత్, శ్రీను, రంజిత్‌లు పాల్గొన్నారు. గుడీపేట్, హాజీపూర్, టీకనపల్లి, మల్కల్ల గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు.