నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశానికి BGMI LITE రాబోతోందని KRAFTON ఇండియా ఇటీవల ప్రకటించింది. గేమ్ ఈ ఏడాది చివరిలో గేమ్ విడుదల కానుంది. విస్తృతమైన క్రీడాకారుల వర్గానికి BGMI అనుభవం తీసుకురావడానికి రూపొందించబడిన BGMI LITE క్రీడాకారులు తెలుసుకొని మరియు ఆనందించే కీలకమైన అంశాలను నిలిపి ఉంచుతూనే గేమ్ ను అనుభవించే విధానాన్ని సజావుగా చేస్తుంది.
ఆగస్ట్ 25, 2026న గూగుల్ ప్లేలో భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం BGMI LITE కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ఆరంభమవుతుంది. ప్రారంభపు డౌన్ లోడ్ సైజ్ సుమారు 1GBగా ఉంటుంది అందువలన క్రీడాకారులకుదీనిని డౌన్ లోడ్ చేయడంసులభంగా ఉంటుంది మరియు వారు సులభంగాBGMI LITEను ఆడటం ప్రారంభించవచ్చు.
ఇప్పటికే BGMI క్రీడాకారులుగా ఉన్న వారి కోసం, BGMI LITEని ఆడటానికి ఎలాంటి అకౌంట్ బదిలీ అవసరం లేదు. క్రీడాకారులు తమ ప్రస్తుతమున్న BGMI అకౌంట్ ను బదిలీ చేయకుండానే BGMI LITEను వేరుగా పొందగలరు, iOS లభ్యత మరియు ప్రీ-రిజిస్ట్రేషన్ లపై వివరాలు తరువాత ప్రకటించబడతాయి.
BGMI LITE గురించి మరిన్ని వివరాలు Battlegrounds యొక్క అభిమానులు అందరితో నిరంతర సమాచారంగా BGMI LITE యొక్క అధికారిక BGMI LITE ఇన్ స్టాగ్రామ్ పేజీపై తెలియచేయబడతాయి.



