
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు .ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జల్కే పాండు రంగ్ మాట్లాడుతూ మహిళలపై కేటీఆర్ చేసిన వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇట్టి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరె పాండు, బత్తిని కిషన్, జడల శ్రీనివాస్, కిర్తి రమణ,కళ్లెం విట్టల్ మైబూబ్, కుంచం గంగాధర్, ముకుందు రావు, రాము, దినేష్, ఉన్నారు.