- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఉస్మానియా ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయించారు.
- Advertisement -


