- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అలర్ట్ సందేశాలు మొదలయ్యాయి. ప్రజల ఫోన్లు సడన్ గా మారు మోగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టే దేశ ప్రజల మోల్ ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ బీప్ అలర్ట్స్ మెసేజెస్ సెండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ వ్యవస్థను పరీక్షిస్తోంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
- Advertisement -



