కేటీఆర్ సభను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – రాయపర్తి
ఈనెల 9వ తేదీన తొర్రూర్ పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆయన ఆలోచనతో రాష్ట్రానికి కొత్తకొత్త పంపెనీలు తీసుకువస్తున్నారు అని తెలిపారు. కేటీఆర్ సేవలు రాష్ట్రానికి చాలా అవసరం అని వివరించారు. బిఆర్ఎస్ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబం వంటిదని అభివర్ణించారు. ప్రతి ఒక్క కార్యకర్తను ఎల్లవేళలా కాపాడుకుంటా అని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డుతో కూడిన రవాణా సౌకర్యం ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందిందని అర్థం అన్నారు. గతంలో అంబులెన్సులు గ్రామాలకు వెళ్లాలన్న ఇబ్బంది ఉండేదని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. మండలంలో గ్రామాలను అనుసంధానం చేస్తూ పూర్తిస్థాయిలో బీటీ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. వ్యవసాయ సాగునీటికి తిప్పలుపడే కాలం చెల్లిపోయిందన్నారు. 365 రోజులు ఎస్సారెస్పీ కెనాల్ కాల్వల ద్వారా చెరువులోకి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. దాంతో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని ప్రతి ఒక్క రైతన్న ఆనందంగా ఉంటున్నారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసిఆర్ పాలన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందన్నారు. కేసిఆర్ సహకారంతోనే నియోజకవర్గ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, కార్యదర్శి పూస మధు,వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love