– వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ తూర్పు పర్యటనను జయప్రదం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఈనెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో శనివారం ఓసిటీ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నరేందర్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన పలు అభివద్ధి పనుల ప్రారంభోత్సవాలు సంక్షేమ సభ నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నరేందర్ దిశనిర్దేశం చేశారు. సంక్షేమ ఫలాలు పొందే లబ్ధిదారులతో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాయకులు చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేల్ రిజ్వాన షమీం మసూద్, నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.