ఎన్ హెచ్ ఎం విభాగంలో పనిచేసే లాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయాలి…

– రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి డిమాండ్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్  : తెలంగాణ  వైద్య  ఆరోగ్యశాఖ  నేషనల్  హెల్త్  మిషన్ ( ఎన్ హెచ్ ఎం ) విభాగంలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లు  కోఠి డి.హెచ్ ఆవరణలో ధర్నా  నిర్వహించారు. ధర్నాలో  ఎన్ హెచ్ ఎం ఎల్యాబ్ టెక్నీషియన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలోఎన్ హెచ్ ఎం విభాగంలో 600 మంది డి ఎస్ సీ  ( డిస్టిక్ సెలక్షన్ కమిటీ )ద్వారా సెలెక్ట్ అయి, గత 25 ఏండ్లుగా సేవలందిస్తున్న అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనేఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి అందరి ఉద్యోగులతో సమానంగా వేదనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఓ దశలో ప్రాణాలు పోతున్న కూడా, మా ప్రాణాలకు తెగించి 24/7 అందుబాటులో ఉండి పనిచేశాము అన్నారు, అయినప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం పై మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరం  తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ  నరేష్,  వైస్ ప్రెసిడెంట్ రంజిత్, తిరుమల్ రెడ్డి, సమీ, సత్య రెడ్డి, కుమార్, శివ, రజిత, శ్రీదేవి, వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది పైగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love