ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో స్వయంభు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం పురస్కరించుకొని గిరి ప్రదక్షణ నరసింహ ఉపవాసకులు బత్తిని  రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ హాజరై గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలకు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతినెల గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల  నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, భక్తులు జంగారెడ్డి, తిరుమలేష్,  శ్రీను, సుదర్శన్ రెడ్డి, పాక జహంగీర్, బత్తిని వెంకటేష్, గొర్ల వైకుంఠం లు పాల్గొన్నారు.
Spread the love