– రామగోవిందాపురంలో సబ్ కలెక్టర్ సర్వే పరిశీలన
నవతెలంగాణ-సత్తుపల్లి
భూ రికార్డులను సరి చూడటంలోను, భూ రీ-సర్వే నిర్వహణలోనూ ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ పారదర్శకంగా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ శుక్రవారం సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని రామగోవిందపురంలో భూ రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని ఆయన సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే వేగవంతం చేయాలన్నారు. భూ సర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, ఖచ్చితత్వంతో సర్వేను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా భూ రీ-సర్వే ప్రక్రియ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను సర్వే సిబ్బందికి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ జారీ చేశారు.
భూ రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



